రైతుల దగ్గర ఉన్న మొత్తం కందులను కొనుగోలు చేయండి

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నుండి కమిషనర్ కొఆపరెటీవ్ డిపార్టుమెంటు వారి స్పెషల్ ఎస్సీ అగ్రికల్చర్ & కొఆపరెటీవ్ ఆద్వర్యం లో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో రైతుల దగ్గర ఉన్న మొత్తం కందులను కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకొవలని అధికారులు అదేశలు జారీ చేసారు పొదిలి తహసీల్దార్ కార్యాలయంలో సదరు వీడియో కాన్ఫరెన్స్ కు సంబంధిత శాఖల అధికారులు అయిన జి. కుమార్ సబ్ డివిజన్ కొఆపరెటీవ్ అధికారి పొదిలి కొఆపరెటీవ్ బ్యాంకు మేనేజర్ జి. యస్. వి. ఆర్ ప్రసాద్ మరియు రేగడపల్లి మాదాలవారిపాలేం మర్రిపూడి తర్లుబాడు చిమట సొసైటీ సంఘ అధ్యక్షులు మరియు కార్యదర్శులు హాజరయ్యారు వీడియో కాన్ఫరెన్స్ లో కౌలు రైతులకు రుణాలు ఇవ్వడంలో పి. ఎ. సి. యస్ ల ద్వారా పొదిలి సబ్ డివిజన్ లో కందుల సేకరణ కు సంబంధించిన విషయాల్లో సక్రమంగా విధులు నిర్వహించి వ్యవసాయం చేసే రైతులకు ఎలాంటి ప్రొత్సాహకాలు ఇవ్వాలని విషయం పై తగు సూచనలు చేశారని ఇకనుండి ప్రతి నెల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రైతులు యెక్క ఆర్థిక స్థితి గతులు మెరుగు పరిచేందుకు తగు చర్యలు గైకొని రైతులను ఆర్థికంగా పరిపుష్టి చేయుటకు అధికంగా సహకార & వ్యవసాయ శాఖలు సమన్వయంతో ముందుకు వెలతామని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరించడమైనది. అలాగే ఆయా వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షులు వారి వారి సంఘములకు కందుల సేకరణ గడువు పొడిగించాలని కొరారు