ఘనంగా జ్యోతి రావు పూలే జయంతి వేడుకలు

మహాత్మ జ్యోతి రావు పూలే 192వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం బుధవారం ఉదయం స్థానిక రోడ్లు భవనాల అతిధి గృహంలో అన్నబోయిన కృష్టయ్య అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా దళిత మహాసభ జిల్లా కార్యదర్శి దర్నాసి పెద్దన్న మాట్లాడుతూ జ్యోతిరావు పూలే గారు కులం పేరుతో అణిచివేతకు గురైన బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి వారి హక్కులకోసం పోరాడి సాధికారతకు కృషి చేసిన మహనీయుడు , సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు ,సంఘసేవకుడైన జ్యోతిరావు పూలే గారిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.ఎంపీటీసీ డాక్టర్ ఇమాంసా మాట్లాడుతూ జ్యోతిరావు పూలే గారు ఆనాడు సమాజంలో బాల్య వివాహాలు సర్వసాధారణం ముసలివారికిచ్చి పెళ్లిచేయడంతో చిన్న వయసులోనే మహిళలు వితంతువులుగా మిగిలేవాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి సమాజం అంగీకరించేది కాదు ఫూలే ప్రజల్లో చైతన్యం తేవడమే కాకుండా స్వయంగా వితంతు వివాహాలు జరిపించారు మరియు వితంతువులు అయిన గర్భిణీ స్త్రీల కోసం “బలహత్యా ప్రదిబంధక్ గృహ” వారికి అండగా నిలిచారని అన్నారు.వేల్పుల కృష్ణంరాజు మాట్లాడుతూ అగ్రవర్గాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా సామాన్యులని ప్రోత్సహించారు సమాజంలో సగభాగం అయిన స్త్రీలు అభివృద్ధి చెందకపోతే సమాజం అభివృద్ధి చెందదు అనుకున్న ఫూలే స్త్రీలు విద్యావంతులు కావాలనే కాంక్షతో ఇతరులకు ఆదర్శంగా ఉండాలని ముందుగా తన భార్య పాఠశాలకు పంపించాడు అనంతరం అన్ని కులాల బాలికలకు పాఠశాలను కూడా ఏర్పాటు చేయగా విద్యాబోధనకు ఉపాద్యాయులు ముందుకు రాకపోవడంతో తన భార్య సావిత్రి సహాయంతో పిల్లలకు పాఠాలు బోధించేలా చేశారు పాఠశాల నిర్వహణలో ఇబ్బందుల కారణంగా కొంతకాలం పాఠశాలను మూసివేశారు అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా మిత్రుల సహాయంతో మళ్ళీ ప్రారంభించారు.. అందరూ ఫూలే గారిని ఆదర్శంగా తీసుకుని ఉన్నతంగా ఎదగాలని కోరారు…
ఈ కార్యక్రమంలో కంభాలపాడు సర్పంచ్ పులగొర్ల శ్రీనివాస్ యాదవ్ ఎంపిటిసి సభ్యులు సయ్యద్ ఇమాంసా తళమల్ల మాజీ సర్పంచ్ వీర్ల శ్రీనివాస్ యాదవ్ మల్లవరం మాజీ సర్పంచ్ యర్రమూడి వెంకట్రావ్ యాదవ్ అఖిల భారత యాదవ మహా సభ జిల్లా ఉపాధ్యక్షులు పోల్లా నరసింహ యాదవ్ బిసి నాయకులు మచ్చా రమణయ్య వెల్పుల కృష్ణంరాజు బంకా వెంకటేశ్వర్లు ఎన్ సురేష్ తదితరులు పాల్గొన్నారు