రసభసాగా మండల పరిషత్ సమావేశం
నీరు పారిశుధ్య సమస్యలు పై దద్దరిల్లిన సభ
ఉపాధి హామీ పనులు రైతులకు ఉపయోగ పడే విధంగా చూడాలి
రెవెన్యూ, రహదారులు భవనాలశాఖ, ప్రొహిబిషన్ శాఖ, విద్యా శాఖ, విద్యుత్ శాఖ అధికారులు డుమ్మా
పొదిలి మండలం సర్వసభ్య సమావేశం మండల పరిషత్ సమావేశపు హాలులో మండల పరిషత్ అధ్యక్షులు కొవెలకుంట్ల నరసింహారావు అధ్యక్షతన జరిగింది ఈకార్యక్రమంలో ముఖ్యంగా పొదిలి పంచాయతీ లొని పారిశుధ్య సమస్య పై యంపీటిసి సభ్యురాలు గౌసీయా బేగం సంబందిత అధికారులు ను నిలదీశారు వాటర్ సమస్య పై మండల కొ ఆప్షన్ సభ్యులు యస్ కె మస్తాన్ వలి గారు సాగర్ నీరు మరియు ట్యాంకర్ల నీరు సామాన్య ప్రజలకు అందడం లేదని అధికారులు తాగునీటి ని అందించాలని అధికారులను కొరారు రక్షిత నీటి సరఫరా శాఖ ఏఇ నారాయణ స్వామి మాట్లాడుతూ ప్రస్తుతం 314 ట్రిప్స్ అందిస్తున్నామని అవసరం అయితే ఇంకా పెంచేవిధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఉపాధి పనులు రైతులకు ఉపయోగ పడే విధంగా చేపించాలాని మండల ఉపాధ్యక్షులు అంజిరెడ్డి ఎపిఓను కోరారు పొదిలి ఆర్టీసీ డిపో వారు మాట్లాడుతూ ప్రస్తుతం పొదిలి డిపో 2017-2018సంవత్సరానికి ఆరు కోట్ల రూపాయలు నష్టం లొ నడుస్తున్నది అన్నారు ప్రస్తుతం ఆర్టీసీ ఉద్యోగులు జీతాలు కు ఆర్టీసీ స్థలాలు అమ్ము కొవలసి వచ్చిందన్నారు దీనికి కారణం ప్రైవేటు వాహన దారులు కారనం అని అన్నారు ప్రజలు ఆర్టీసీ ని ఆదరించాలని కొరారు ఈకార్యక్రమానికి జడ్పీటిసి సభ్యులు సాయిరాజేశ్వరరావు యంపీడిఓ రత్న జ్యోతి యంపీటిసి సభ్యులు సర్పంచ్ లు అధికారులు తదితరులు పాల్గొన్నారు