కందుల కొనుగోలు నిలిపివేసిన అధికారులు తీవ్ర ఆందోళనలో రైతులు

కమీషన్ ఇస్తే ఇంటి దగ్గర నుండి నేరుగా ఒంగోలు గూడెంకు తరలిస్తున్నారని రైతులు ఆరోపణ                                                                                                                                                                                                                                                                                   పొదిలి పట్టణంలోని వాసవీ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం నాడు మార్క్ ఫెడ్ అధికారుల ఆదేశాలు మేరకు కొనుగోలు నిలిపివేస్తున్నట్లు కేంద్రం నిర్వాహకులు తెలపటంతో ఒక్కసారిగా రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు 20రోజుల పాటు కొనుగోలు నిలిపివేసిన అధికారులు గత శుక్రవారం తిరిగి కొనుగోలు ప్రారంభించి నాలుగు రోజులకే కొనుగోలు నిలిపి వేయడం పై వెనక గల కారణం ఏమిటని కేంద్ర నిర్వకులను మండల వ్యవసాయ శాఖ అధికారి ని రైతులు నిలదీశారు పొదిలి మండలం లో సుమారు 28 వేల టన్నులు కందులు కొనుగోలు చేయవలసి ఉందని వ్యవసాయ అధికారి నిన్న కేంద్రాన్ని పరిశీలించిన శాసనసభ్యులు జంకె వెంకట రెడ్డి కి తెలియజేసి వారంలో మొత్తం కొనుగోలుచేస్తామని తెలిపిన అధికారులు నేడు కేంద్రాన్ని నిలిపి వేయడం ఏమిటి అనేది అర్థం కావటం లేదని రైతులు ఆరోపణ చేస్తున్నారు ఇంత ఆందోళన జరుగుతున్నా అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంతో దాళారుల ద్వారా 650 నుండి1650రూపాయలు ముందుగా డబ్బులు ఇచ్చిన వారివి ఇంటి వద్ద నుండి కొనుగోలు చేస్తున్నారని వచ్చిన ఆరోపణలు కూడా నిజమేనా అన్న అనుమానం కలుగుతుంది కందుల కొనుగోలు కేంద్ర వద్దకు వివిధ పార్టీ నాయకులు చేరుకొని తమ సంఘీభావం ప్రకటించి రైతులు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించిన తమ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు