సైకిల్ యాత్రను జయప్రదం చేయండి : కాటూరి
ప్రత్యేక హోదా సాధన కోసం కేంద్ర ప్రభుత్వం అనుసరించే నిరంకుశ వైఖరికి నిరసనగా తెలుగు దేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చెప్పటిన సైకిల్ యాత్ర ను విజయవంతం చేయలని మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు కాటూరి వెంకట నారయణ బాబు అన్నారు స్థానిక రోడ్లు భవనాల అతిధి గృహం నందు జరిగిన తెలుగు దేశం పార్టీ మండల కార్యకర్తల సమావేశం మండల పార్టీ కార్యదర్శి షేక్ రసూల్ అధ్యక్షతన తో జరిగింది. ఈ సమావేశంలో సైకిల్ యాత్ర రూట్ మ్యాప్ ను ఖారరు చేసారు . ఆదివారం నాడు మల్లవారం కుంచేపల్లి గోల్లపల్లి సూదనగుంట గ్రామలు సోమవారం నాడు తుమ్మగుంట గురుగుపాడు అక్కచెరువు మాదలవారి పాలెం సలకనూతల ఓబులక్కపల్లి నందిపాలెం పోతవరం మంగళవారం పొదిలి విశ్వనాథపురం పెద్దబస్టాండ్ కాటూరివారి పాలెం అముదలపల్లి అన్నవరం బుధవారం తలమళ్ళ గోగినేని వారి పాలెం ఉప్పలపాడు గ్రామ పంచాయతీ లలో సైకిల్ యాత్ర జరుగుతుందిని ఈ యాత్ర లో తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు మరియు ప్రజలు భారీ పాల్గొని జయప్రదం చేయవసిందిగా నాయకులు పిలుపునిచ్చారు ఈ సమావేశంలో తెలుగు దేశం పార్టీ నాయకులు కందుల సుబ్బారెడ్డి యార్రమూడి వెంకటేశ్వర రెడ్డి శామంతపుడి నాగేశ్వరరావు గునుపూడి భాస్కర్ తెలుగు మహిళ అధ్యక్షరాలు సోముశెట్టి శ్రీదేవి శ్రీనివాసులురెడ్డి షేక్ జిలానీ తదితరులు పాల్గొన్నారు