రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకులకు గాయాలు తండ్రి పరిస్థితి విషమం గుంటూరుకు తరలింపు ఆగ్రహించిన గ్రామస్థులు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని రాస్తారోకో
పొదిలి మండలం కంబాలపాడు గ్రామంనందు రోడ్డు దాటుతుండగా కనిగిరి డిపో చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొని చీకటి వెంకట నరసింహులు (30) చీకటి బ్రహ్మయ్య (4)లకు గాయాలుకాగా నరసింహులు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలించి అక్కడి నుండి గుంటూరుకు తరలించినట్లు సమాచారం ప్రమాదంపై ఆగ్రహించిన గ్రామస్థులు తక్షణమే స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని రాస్తారోకో నిర్వహించారు. గ్రామస్థులు స్వంతంగా స్పీడ్ బ్రేకర్లు వేసుకున్నారు. విషయం తెలుసుకున్న పొదిలి యస్ఐ నాగరాజు సంఘటన స్ధలానికి చేరుకొని ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు.