పొదిలిలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

పొదిలి విశ్వనాథపురం లోని ఆంజనేయ స్వామి దేవస్థానం నందు హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. సోమవారం నాడు ఘనంగా ప్రారంభం అయిన హనుమాన్ జయంతి వేడుకలు నేడు అనగా గురువారం నాడు మధ్యాహ్నం అన్నదానం మరియు సాయంత్రం గ్రామోత్సవం జరిగాయి. ఈ వేడుకలలో ఇప్పటివరకు వేలాదిమంది భక్తులు హనుమంతుడిని దర్శించుకున్నారు రేపు అనగా శుక్రవారంతో వేడుకలు ముగియనున్నట్టు ఆలయ పూజారి బాలాజీ తెలిపారు.