గుండెపోటుతో ఎంపీడీఓ మృతి

కనిగిరి ఎంపీడీఓ గా పని చేస్తున్న కోదండరామయ్య (53) మంగళవారం అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందారు. వివరాల్లోకి వెళితే కనిగిరి ఎంపీడీఓ కోదండరామయ్య(53) మంగళవారం ఉదయం విధులకు హాజరవ్వడానికి సిద్ధం అవుతుండగా అకస్మాత్తుగా గుండెపోటుతో రావడంతో హాస్పిటల్ కి తరలించారు అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కోదండరామయ్య హనుమంతునిపాడు ఇంఛార్జి గా కూడా ఉన్నారు. కోదండరామయ్య కి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. జడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు కోదండరామయ్య పార్ధీవదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.