పార్ధి గ్యాంగ్లు వదంతులు నమ్మకండి : యస్ఐ నాగరాజు

పొదిలి ప్రాంతంలో ఇటీవల కాలంలో కొంత మంది వ్యక్తులు పీకలుకోసేవారు వచ్చారని , పిల్లలను ఎత్తుకెళ్లేవారువచ్చారని పార్ధి గ్యాంగ్ సంచరిస్తుందని ఇలా అనేకరకాలుగా లేనిపోని అబద్ధపు వదంతులు ప్రచారంలో ఉన్నాయని వాటిని నమ్మవద్దని పొదిలి యస్ఐ నాగరాజు తనను కలిసిన విలేకరులతో తెలిపారు. ఈ వదంతులను నమ్మిన చాలమంది గ్రామస్థులు రాత్రి పూట ఆయుధాలతో తిరుగుతూ మతిస్థిమితం లేనివారిని ఇతర పనులపై గ్రామానికి వచ్చిన కొత్తవారిని అనుమాణిస్తూ వారిపై దాడి చేస్తూ వారిని గాయపరుస్తున్నారు ఇది సరైన ప్రక్రియ కాదు మరియు ఇలా ఇతరులను హింసించి గాయపరచడం చట్టప్రకారం నేరం దయచేసి ఎవరిని గాయపరచవద్దు ఎవరైనా కొత్తవ్యక్తులు గాని అనుమానాస్పద వ్యక్తులు గాని మన గ్రామాలలో సంచరిస్తుంటే పోలీసు వారికి సమాచారం ఇవ్వగలిగితే వారు వచ్చి విచారించి తగిన చర్యలు తీసుకోగలని ఆయన తెలిపారు మన ఏరియాలో ఎలాంటి పార్ధి గ్యాంగ్ కు సంభందించిన వ్యక్తులు గాని ఇతరులు గాని సంచరించటం లేదు ఇలాంటి వదంతులను నమ్మవద్దు మరియు దయచేసి ముఖ్యంగా మతి స్థిమితం లేకుండా తిరిగే పిచ్చివారిపై ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దు మీ రక్షణగా పోలీసువారు నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నారని గమనించి ప్రజలు సహాకరించాలని ఆయన తెలిపారు