పొదిలి పంచాయతీ కి ఏమైంది ?

నిధులున్నా అభివృద్ధికి నోచుకోని పొదిలి మేజర్ పంచాయతి

ఏప్రిల్ 12వ తేదీన సర్వసభ్య సమావేశంలో తిరస్కరించిన సుమారు 2.5 కోట్ల అభివృద్ధి పనులు

మే 22న జరిగిన సమావేశంలో కూడా అదే తీరు

వివరాల్లోకి వెళితే గతనెల ఏప్రిల్ 12వ తేదీన జరిగిన పంచాయతీ సర్వసభ్య సమావేశంలో సుమారు 2.5కోట్ల అభివృద్ధి పనులకు సంబంధించిన 21 అంశాలను సమావేశంలో ప్రవేశపెట్టగా అంతకు ముందు జరిగిన పనులలో జాప్యం జరిగిందని మెజారిటీ సభ్యులు సర్పంచ్ తీరుపై మండిపడ్డారు. సర్పంచ్ ను వర్క్స్ కమిటీ మినిట్స్ బుక్ చూపించాలని సభ్యులు పట్టుపట్టగా వచ్చే సమావేశంలో చూపిస్తానని సర్పంచ్ చెప్పడంతో సర్పంచ్ మొండి వైఖరికి నిరసనగా రిలే నిరాహారదీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. అదే విధంగా మే 22వ తేదీన జరిగిన సమావేశంలో కూడా వర్క్స్ కమిటీ మినిట్స్ బుక్ చూపించకపోవడంతో సభ్యులు ఈసారి కూడా అదే 2.5కోట్ల అభివృద్ధి పనులకు సంబంధించిన తీర్మానాన్ని తిరస్కరించారు. పంచాయతీలో జరుగుతున్న గందరగోళంపై ప్రజలు అయోమయంలో ఉన్నారు పొదిలి ఒక మేజర్ పంచాయతీ అయినప్పటికీ పంచాయతీకి సంబంధించిన పనులు సరిగా జరగడంలేదు కనీసం ఇలా అయితే పొదిలి అభివృద్ధి చెందేది ఎప్పుడో అని పంచాయతీ తీరుపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.గతనెల ఏప్రిల్ 12వ తేదీన సభలో గందరగోళాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తు సమాచారంతో ఎస్ ఐ నాగరాజు పంచాయతీ కార్యాలయాన్ని పర్యవేక్షించారు.