కోట్ల రూపాయలు విలువ చేసే పొదిలమ్మ దేవస్థానం భూముల ఆక్రమణకు ఆపరేషన్ ధరణి ప్రారంభించిన భూకబ్జాదారులు

2007 లో అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆక్రమణదారులు

భూమి ఆక్రమణపై గతంలో ఎఫ్ఐఆర్ నమోదు

దేశం నాయకుల ఒత్తిడి తో కోర్టులో రాజీపడ్డ దేవస్థానం కార్యనిర్వహణ అధికారి

తిరిగి పనులు ప్రారంభించిన ఆక్రమణదారులు
దేవస్థానం మొత్తం భూమిపై కన్నేసిన పసుపు నేతలు

పొదిలి టైమ్స్ ఒత్తిడితో పనులు నిలిపివేసి హెచ్చరిక బోర్డ్ పెట్టిన దేవస్థానం అధికారులు

రంగంలోకి ల్యాండ్ మాఫియా

పొదిలిలో ల్యాండ్ మాఫియా చెలరేగిపోతుంది ఆపరేషన్ ధరణి పేరుతో పచ్చ నాయకులు కోట్ల రూపాయలు విలువ చేసే పొదిలమ్మ దేవస్థాన భూముల కబ్జాకు రంగం సిద్ధం చేశారు.బుగ్గచలం వాటర్ ట్యాంక్ ఎదురు నందు సుమారు కోటి రూపాయలు విలువచేసే ఐదు సెంట్ల భూమిని కబ్జా చేసేందుకు పనులు చేయిస్తున్నారు. గతంలో పచ్చ నాయకులు ఇదే ఐదు సెంట్ల స్థలాన్ని కబ్జా చేయడానికి యత్నించారు. 2007 సంవత్సరంలో అక్రమంగా రిజిస్ట్రేషన్ లు చేసుకున్న పచ్చ నాయకులు ఎదురుదెబ్బ తగిలింది ఆనాడు దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు కోర్టులో కేసు నడుస్తుండగానే దేవస్థాన కార్యనిర్వహణాధికారి పై పచ్చ నాయకులు ఒత్తిడి తీసుకురాగా దేవస్థాన కార్యనిర్వహణాధికారి కేసు రాజీపడడం జరిగింది. మే నెలలో మరలా అదే తంతు ఈసారి 289-2 సర్వే నంబర్ లో గల దేవస్థాన భూమి మొత్తం 6.25 ఎకరాలను అక్రమించేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. దేవస్థాన భూములను ఆక్రమణకు గురవుతున్నట్లు పొదిలిటైమ్స్ కు సమాచారం అందడంతో పొదిలిటైమ్స్ ఈ విషయంపై నిఘా ఏర్పాటు చేసింది. ఆక్రమణ జరుగుతున్న విషయం వాస్తవమే అని నిర్ధారణకు వచ్చిన తర్వాత దేవస్థాన అధికారులకు ఈ విషయంపై ఫిర్యాదు చేయగా దేవస్థాన అధికారులు అప్పటికప్పుడు చుట్టూ కంచె వేసి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూములను అడ్డగోలుగా ఎలాగో కబ్జా చేస్తున్నారు. చెరువులు వాగులు ఏమి వదలట్లేదు దేవస్థానాలను కూడా వడలట్లేదా ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఎప్పుడో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వచ్చి చూసి వెళ్లడం కాదు దేవస్థాన ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత దేవస్థాన కమిటీలకు ఉందని గుర్తుచేశారు. దేవస్థాన భూముల విషయంలో పొదిలిటైమ్స్ చూపిన చొరవకు కృతజ్ఞతలు తెలిపారు.

                                                                                                                                                                                  *  రేపటి పోస్ట్ లో పూర్తి వివరాలు……