దేవాలయ శాఖ వారు పెట్టిన హెచ్చరిక బోర్డ్ ను తొలగించిన భూకబ్జాదారులు
పొదిలమ్మ దేవస్థానం భూమిలో భూకబ్జాదారులు ఆక్రమంగా నిర్మాణంపై మీడియా పిర్యాదు మేరకు నిన్న బుధవారం నాడు దేవాదాయశాఖ కార్యనిర్వహణ అధికారి దాసరి చంద్ర శేఖర్ సదరు పనులు ప్రారంభించిన భూమికి ఫేన్షింగ్ వేసి పెట్టిన హెచ్చరిక బోర్డ్‌ను గురువారం మద్యహ్నం భూకబ్జాదారులు తొలగించి వెళ్ళిన విషయంని కార్యనిర్వహణ అధికారి చంద్ర శేఖర్ దృష్టికి తీసుకొని వెళ్ళాగా సదరు విషయం రేపు వచ్చి పొదిలి పోలీసు స్టేషన్ హెచ్చరిక బోర్డ్‌ను తొలగించిన వారిపై పిర్యాదు చేస్తానని తెలిపారు పసుపు పార్టీ అండచూసుకొని భూకబ్జాదారులు హెచ్చరిక బోర్డ్ ను తొలగించటం పట్ల పొదిలమ్మ తల్లి భక్తులు ప్రజలు తీవ్ర ఆందోళన లో ఉన్నారు బోర్డ్ తొలగించిన భూకబ్జాదారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలిని ప్రజలు భక్తులు కోరుతున్నారు