పొదిలిటైమ్స్ కథనంతో కదిలిన రెవిన్యూ యంత్రాంగం
బుధవారం నాడు పొదిలిటైమ్స్ లో పొదిలమ్మ దేవస్థానం భూముల పై ఆపరేషన్ ధరణి ప్రారంభం అనే కథనంపై రెవిన్యూ యంత్రాంగంలో కదలిక మొదలైంది శుక్రవారం నాడు ఆర్ డి ఓ మల్లిఖర్జున ఆదేశాల మేరకు రెవిన్యూ సిబ్బంది ఆక్రమణకు యత్నించిన స్థలాన్ని పరిశీలించి హెచ్చరిక బోర్డును తిరిగి ఏర్పాటు చేశారు.ఈ విషయంపై విచారణ జరిపి నివేదికను ఉన్నతాధికారులకు పంపించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ విద్యాసాగరుడు మాట్లాడుతూ దేవస్థానానికి సంబంధించిన భూమిని అక్రమించడానికి యత్నించడం బాధాకరమని భూ కబ్జాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ సుబ్బరాయుడు విఆర్ఓ బ్రహ్మ రెడ్డి దేవాదాయ శాఖ జూనియర్ అసిస్టెంట్ కాటూరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు