ఎంఐఎం లౌకిక పార్టీ : జిల్లా అధ్యక్షులు షరీఫ్

ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) పార్టీ లౌకిక పార్టీని బిసి యస్సీ యస్టీ మైనారిటీ హక్కుల కోసం పనిచేసే పార్టీని జిల్లా అధ్యక్షులు షేక్ షరీఫ్ అన్నారు. స్ధానిక రోడ్లు భవనాలు అతిధి గృహంలో పొదిలి యూనిట్ నూతన కమిటీ ఏర్పాటు సందర్భంగా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు షరీఫ్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో అన్ని సీట్లుకు పోటి చేస్తామని ఆ దిశగా పార్టీ విస్తరణ చేస్తున్నమని అన్నారు జిల్లా యువజన అధ్యక్షులు మబ్బుల్ అలీ మాట్లాడుతూ జిల్లా పార్టీ నిర్మాణం పూర్తి అయిన తరువాత జాతీయ అధ్యక్షులు పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఒవైసీ జిల్లా పర్యటనకు వస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో మార్కపురం వినుకొండ నియైజకవర్గల ఇన్చార్జ్లు ఆర్షద్ ఖాన్ షేక్ బాజిద్ స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు