ఘనంగా అఖిలేష్ యాదవ్ జన్మదిన వేడుకలు
సమాజ్ వాది పార్టీ జాతీయ అధ్యక్షులు భావి ప్రధాని మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ 45వ జన్మదిన వేడుకల కార్యక్రమం స్ధానిక రోడ్లు మరియు భవనముల అతిధి గృహంలో ఆదివారం ఉదయం జరిగాయి. అఖిలేష్ యాదవ్ యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేకు ను అన్నబోయిన కృష్టయ్య యాదవ్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్ యువసేన నాయకులు మందగిరి వెంకటేష్ యాదవ్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో అఖిలేష్ యాదవ్ ను ప్రధానిగా చూసుకొనే విధంగా మనం పనిచేయాలని బిజెపి పార్టీని డిల్లీ గద్దె దించేందుకు కృషి చేసి భారత హృదయ సమ్రాట్ భావి ప్రధాని అఖిలేష్ యాదవ్ ను ప్రధానిగా చూసే కలను సాకరం చేసుకోవడానికి ప్రతి ఒక్కరు అఖిలేష్ యాదవ్ కు బాసటగా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో అఖిలేష్ యాదవ్ యువసేన నాయకులు షేక్ జహీర్, ముజుబుర్ రహమాన్, మోరబోయిన బాబురావు యాదవ్, పొల్లా నరసింహ యాదవ్, బివి నరసింహరావు యాదవ్, లోమడ సూర్య నారాయణ యాదవ్, మోరబోయిన మురళి యాదవ్, నంద్యాల ముసలయ్య యాదవ్, బండారు శివ యాదవ్, నుగ్గు వీరనారాయన యాదవ్, జోగి శ్రీను యాదవ్, శ్రీకాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.