మార్కాపురంపై పట్టుకు గాలిపటం సన్నాహాలు
రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లో బలపడేందుకు ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) ఇందు కోసం పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని ఆ పార్టీ యోచిస్తుంది. ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాలలో ప్రతి నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు 30 వేలకు పైగా ఉన్నాయి ముఖ్యంగా ఒక్క మార్కాపురం నియోజకవర్గం లోనే 35 వేల మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు నియోజకవర్గంలో ఇతర బిసి, యస్సీ, యస్టీ ఓటర్లు మరో లక్షా 10 వేలు అన్నీ కలుపుకుంటే మొత్తం 1లక్ష 50 వేలు మంది బలహీన వర్గాలకు చెందిన ఓటర్లు ఉండటంతో ఇక్కడ పాగా వేయడం కష్టమేమి కాదని అందుకు తగ్గ పక్కా ప్రణాళికతో ముందుకు వెళితే బహుముఖ పోటిలో విజయం సాధించవచ్చని భావనలో ఉంది. అందులో భాగంగా ముందు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయడం పెద్ద ఎత్తున వాట్సాప్ గ్రూపులు ఏర్పాటుచేసి ఎంఐఎం భావజాలం వ్యాప్తి చేసి ఓటర్లను ఆకర్షించే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు. అందులో భాగంగా నియోజకవర్గంలో పెద్ద వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేశారు. పార్టీ నిర్మాణ ప్రక్రియలో భాగంగా పొదిలి నందు సమావేశం ఏర్పాటు చేసి హడక్ కమిటీ ఏర్పాటు చేసి సభ్యత్వ నమోదు ప్రారంభించారు. చాప క్రింద నీరులాగా ముస్లింలను పూర్తిగా ఎంఐఎం వైపు ఉండే విధంగా ప్రచారం మొదలు పెట్టారు. మరో వైపు బిసి, యస్సీ, యస్టీ లోని ముఖ్యమైన ద్వితీయ శ్రేణి నాయకులతో మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా తమ పార్టీకి అందరి మద్దతు కలిసి వచ్చే విధంగా చర్చలు జరుపుతూ పావులు కదుపుతున్నారు. ఆగష్టు నెలలో మార్కాపురం నియోజకవర్గంలో పొదిలి మరియు మార్కాపురం నందు జాతీయ అధ్యక్షులు అసదుద్దీన్ ఒవైసీ పర్యటించే విధంగా పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది. జాతీయ అధ్యక్షులు పర్యటన తరువాత వేగవంతంగా ముందుకు వెళ్ళాలని భావిస్తున్నాట్లు సమాచారం.