ఎన్టీఆర్ గృహాలను ప్రారంభించిన : ఎఇ నారాయణరెడ్డి
పొదిలి స్థానిక విశ్వనాథపురం మరియు కాటూరివారిపాలెం గ్రామాలలో ఎన్టీఆర్ హౌసింగ్ కార్యక్రమం క్రింద గృహాలు నిర్మించుకున్న లబ్ధిదారులకు పత్రాలను అందజేసి నూతన గృహాలను హౌసింగ్ ఎఇ నారాయణరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలం మొత్తం 470 గృహాలు నేటికి పూర్తి అయ్యి గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటిసి సాయి రాజేశ్వరరావు, గృహ నిర్మాణశాఖ అధికారులు శివరాత్రి మల్లిఖార్జునరావు,ఎంపిటిసి సభ్యులు సయ్యద్ ఇమాంసా, పంచాయతీ సభ్యులు నూర్జహాన్, మస్తాన్ వలి, రసూల్ తదితరులు పాల్గొన్నారు.