ఎన్టీఆర్ గృహాల ప్రారంభం

ఎన్టీఆర్ హౌసింగ్ కార్యక్రమంలో భాగంగా కంభాలపాడు గ్రామంలో గృహాలు నిర్మించుకున్న లబ్ధిదారులు చిన్నంశెట్టి లక్ష్మికి పత్రాలను అందజేసి నూతన గృహాలను పొదిలి జడ్పీటీసీ సాయి రాజేశ్వరరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పులగొర్ల శ్రీనివాస్ యాదవ్, గృహా నిర్మాణ శాఖ ఎఇ నారాయణ రెడ్డి, సూపరింటెండెంట్ మల్లిఖార్జున, ఈఓఆర్డి రంగనాయకులు, జన్మభూమి కమిటీ సభ్యుడు అవులూరి కోటేశ్వరరావు, లబ్ధిదారులు చిన్నంశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు