MPDO ఝాన్సీరాణిని సత్కరించిన మండల పరిషత్ పాలకవర్గం

పొదిలి మండల పరిషత్ అబివృద్ది అధికారిణి శ్రీమతి ఝాన్సీ రాణి  పదోన్నతి పొందటం పై మండల పరిషత్ పాలకవర్గం  ఘానంగా సత్కరించారు.
కార్యక్రమంలో ఎంపీపీ నరసింహరావు మాట్లాడుతూ మేడం పొదిలి మండల అభివృద్ధికి   తోడ్పాటు అందించారని పేర్కొన్నారు. జడ్పీటీసీ సాయి రాజేశ్వరరావు మాట్లాడుతూ మైనారిటీ కార్పొరేషన్ ed గా పదోన్నతి పై వెళ్తున్నందున కేంద్ర ప్రభుత్వ మైనారిటీ శాఖకు సంబందించిన ” మల్టీ సెక్టోరల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ” స్కీం మైనారిటీ ల కోసం పొదిలికి వచ్చేందుకు తమరు కృషి చేయాలని వేదికమీదనే మొట్టమొదటి వినతి పత్రం mpdo ఝాన్సీరాణికి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో  సర్పంచ్లు,ఎంపీటీసీలు, జన్మభూమి కమిటీ సభ్యులు, పంచాయతీ సేక్రేటరీలు, మండల్ పరిషద్ సిబ్బంది తదితరులు పల్గకోన్నరు.