ఉప సర్పంచ్ అవిశ్వాసం పై 16న ప్రత్యేక సమావేశం
పొదిలి ఉప సర్పంచ్ ఖాసింబి పై 11 మంది గ్రామ పంచాయతీ సభ్యుల సంతకాలు తో కూడిన అవిశ్వాసం నోటీసు ను కందుకూరు ఆర్డీఓ మల్లిఖార్జునరావు కు అక్టోబర్ 21న ఇవ్వటం జరిగింది. అవిశ్వాసం నోటీసు పై నవబంర్ 16న పొదిలి గ్రామ పంచాయతీ కార్యలయం నందు ఉదయ 11 గంటల కు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లుగా గ్రామ పంచాయతీ సభ్యులు అందరికీ కందుకూరు రెవెన్యూ డివిజన్ అధికారి నోటీసులు జారీ చేసారు.