తడి, పొడి చెత్తపై అవగాహన సదస్సు
స్వచ్చ్ సర్వేక్షణ్ లో భాగంగా తడి చెత్త, పొడి చెత్త పై అవగాహన సదస్సు నిర్వహించారు. స్ధానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం మండల పంచాయతీ విస్తరణ అధికారి మరియు అదనపు పంచాయతీ కార్యదర్శి అద్యక్షతన జరిగిన సదస్సులో జిల్లా పరిషత్ స్వచ్ఛ సర్వేక్షణ్ విభాగం సంచాలకులు షేక్ షరీఫ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ సర్వేక్షణ్ లో భాగంగా నివాస,నివేశతెరల నుండి తడి చెత్త, పొడి చెత్తను వేరు వేరుగా తీసుకుని వాటిని డంపింగ్ యార్డ్ కు చేర్చి తిరిగి పునరుత్పత్తి చేస్తామని అందులో భాగంగా, ప్రతి ఇంటికి తడి చెత్తకు ఒక డబ్బాను, పొడి చెత్తకు ఒక డబ్బాను ఇస్తామని ప్రతి వెయ్యి మందికి ఒక వ్యక్తి చొప్పున నియమాకం చేసి వారిలో పవర్ రిక్షా వాలాలను ముగ్గురిని ఎంపిక చేసి నెలకు ఆరువేల రూపాయల వేతనం ఇస్తామని తెలిపారు. వీరిలో ప్రతి ఒక్కరు రోజుకు రెండువందల కేజీల చెత్తను సేకరణ చేయాలని వాటికి చెందిన పలు అంశాలను గురించి అవగాహన కల్పించారు. నెలఖరికి సంబంధించిన ప్రక్రియను పంచాయతీ అధికారులు పూర్తి చేయాలని నవంబర్ నెల నుండి ఈ కార్యమాన్ని ప్రారంభం చేసే విధంగా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి మరియు పంచాయతీ ప్రత్యేక అధికారిణి రత్నజ్యోతి, మరియు మండలంలోని పంచాయితీ కార్యదర్శిలు, పంచాయితీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.