ముఖ్య ప్రణాళిక అధికారి మరియు గణాంకశాఖ ఒంగోలు వారి ఆధ్వర్యంలో సజ్జపంట కోత ప్రయోగం

ముఖ్య ప్రణాళికా అధికారి మరియు గణాంకశాఖ ఆధ్వర్యంలో పొదిలి వ్యవసాయశాఖ వారు అక్కచెరువు గ్రామం నందు సజ్జపంట కోత ప్రయోగం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య ప్రణాళిక అధికారి డి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ కోత ప్రయోగం ద్వారా ఖరీఫ్, రబిలో సాగు చేసిన పంటల దిగుబడి అంచనావేసి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామన్నారు. ముఖ్య ప్రణాళిక అధికారి కార్యాలయం ఏడీ సునీత మాట్లాడుతూ పంటకోత ప్రయోగం ద్వారానే ఏ పంట దిగుబడి ఎంత వస్తుంది వస్తుంది అని అంచనా వేసి దిగుబడి, ఇన్సూరెన్స్ వంటి పధకాలను అంచనా వేయవచ్చన్నారు.

పొదిలి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం………..

పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా బహుళార్ధ ప్రయోజన విస్తరణ అధికారిణి బి.కల్యాణి మండలంలోని ఆముదాలపల్లి, రాములవీడు గ్రామాల్లోని పొలాలను సందర్శించి ప్రస్తుతం కంది పెరిగే దశలో ఆకుచుట్టు పురుగు వ్యాప్తి చెందుతుందని దాని బారినుండి పంటను కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించారు. అలాగే జొన్న, సోయాచిక్కుడు, మినుములు, నువ్వులు వంటి పంటలలో పంటమార్పిడి వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య ప్రణాళిక అధికారి కార్యాలయం ప్రత్యేకాధికారి నాగేశ్వరరావు, ఏఈఓ లు సుబ్బారెడ్డి, అరుంధతి, ఎంపిఈఓ గురుబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.