మెగా వైద్యశిబిరాన్ని ప్రారంభించిన ఎంపిపి నరసింహంరావు
కిమ్స్ వైద్యశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని మండల పరిషత్ అధ్యక్షులు కోవెలకుంట్ల నరసింహరావు ప్రారంభించారు. స్ధానిక మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం నాడు కిమ్స్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన శిబిరం ప్రారంభం సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ కిమ్స్ లాంటి మల్టీ స్పెషల్ వైద్య బృందం పొదిలి లాంటి వెనకబడిన ప్రాంతంలో ఇలాంటి వైద్యశిబిరం ఏర్పాటు చేయడం శుభపరిణామమని అన్నారు. ఈ శిబిరంలో అన్ని రకాల విభాగాలకు చెందిన వైద్యులు హాజరుకాగా ప్రజలు భారీగా పాల్గొని వైద్య సేవలు వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి రత్నజ్యోతి, మాజీ సర్పంచులు పులగొర్ల శ్రీనివాస్ యాదవ్, నారాయణస్వామి,
కిమ్స్ వైద్యులు కమల్ హాసన్, విష్ణు, కిషోర్, రూపస్, కిమ్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.