రోగులకు పండ్లు పంపిణీ చేసిన న్యాయవాదులు
ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ వైద్యశాల నందు న్యాయవాదులు పండ్లు పంపిణీ చేశారు. వివరాల్లోకి వెళితే పొదిలి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు జడ్జి ఎస్ సి రాఘవేంద్ర ఆదేశాల మేరకు బార్ అసోసియేషన్ న్యాయవాదులు ఈ పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ నాయకులు ముల్లా ఖాదర్ వలి, శ్రీపతి శ్రీనివాసరావు, నాగరాజు, రాఘవరావు, కొండా నరసింహరావు, ముల్లా నాయబ్ రసూల్, తదితరులు పాల్గొన్నారు.