దాడి, దొంగతనం కేసులలో ముద్దాయి అరెస్ట్
మండలంలోని ఉప్పలపాడు మూసివాగు వద్ద లారీడ్రైవర్ పై దాడి చేసి అతని వద్ద ఉన్న 42000నగదు, 2సెల్ ఫోన్లను దొంగిలించి………… తలమల్ల గ్రామం వద్ద షుగర్ తగ్గడంతో అక్కడే పక్కన కల్వర్టుపై పడుకున్న వ్యక్తిపై దాడి చేసి 18,500రూపాయలు దొంగిలించిన…… రెండు కేసులలో ముద్దాయిలు అయిన ఉప్పలపాడు కు చెందిన యక్కంటి ప్రతాప్ రెడ్డి, మరో ముగ్గురిలో ప్రతాప్ రెడ్డిని గురువారం నాడు అరెస్ట్ చేసినట్లు పొదిలి సిఐ మాకినేని శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. మిగిలిన ముగ్గురిని దర్యాప్తు అనంతరం అరెస్టు చేయనున్నట్లు తెలిపారు.