వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా కల్లం సుబ్బారెడ్డి
పొదిలి ప్రభుత్వ జూనియర్ కళాశాల వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా కల్లం సుబ్బారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వివరాల్లోకి వెళితే సోమవారం ఉదయం జూనియర్ కళాశాల ఆవరణలో వాకింగ్ చేసే వాకర్స్ సమావేశం ఏర్పాటు చేసుకుని నూతనంగా వాకర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసి కార్యవర్గం ఎంపిక చేశారు. అధ్యక్షులుగా కల్లం సుబ్బారెడ్డి, ఉపాధ్యక్షులు గుంటూరి వీరబ్రహ్మం, షేక్ నజీర్, లక్ష్మి నరసారెడ్డి, చప్పిడి చిన్న రామలింగయ్య, షేక్ జిలాని, గొలమారి చెన్నారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా షేక్ ఖలీల్, కార్యదర్శిలుగా మెర్సీన్ బాబు, ముల్లా షుకూర్, కనమర్ల రామారావు, కోశాధికారి బి బుచ్చయ్య, కార్యవర్గసభ్యులుగా డి వెంకటేశ్వర్లు, పాలడుగు నాగేశ్వరరావు, ముల్లా జాకీర్ హుస్సేన్, కంకణాల రమేష్, ఈశ్వరరెడ్డితో కూడిన కమిటీని ఎన్నుకున్నారు.