నీటి సమస్యపై జరిగే రౌండ్ టేబుల్ సమావేశాన్ని జయప్రదం చేయండి
పొదిలి మండలంలో గత ఐదు సంవత్సరాల నుండి కరువుతో తల్లడుతూ, భూగర్భ జలాలు అడుగంటి తీవ్ర నీటి సమస్య ఏదుర్కోకుంటున్న అంశంపై అక్టోబర్ 21వ తేది ఆదివారం ఉదయం 10 గంటలకు అన్ని రాజకీయ పార్టీలు, మరియు ప్రజా సంఘాలు, రైతు సంఘాలతో అఖిల భారత యాదవ మహాసభ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యచరణ మరియు శాశ్వత పరిష్కారం కొరకు ఉద్యమం చేపట్టే విధంగా అన్ని వర్గాల ప్రజలు, ప్రజా ప్రక్షాలు, ప్రజా సంఘాలు ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరై జయప్రదం చేయాలని అఖిల భారత యాదవ మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు పొల్లా నరసింహ యాదవ్, జిల్లా కార్యదర్శి మూరబోయిన బాబూరావు యాదవ్, మండల నాయకులు శిరిమల్లె శ్రీనివాస్ యాదవ్, కనకం వెంకట్రావు, పి రాజు, బిసి సంక్షేమ సంఘం నాయకులు మచ్చా రమణయ్య, వెలుగు శ్రీనులు అఖిలభారత యాదవ మహాసభ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోరారు.