పలు దొంగతనాల కేసుల్లో మైనర్ బాలుడు అరెస్టు
పలు దొంగతనాల కేసుల్లో మైనర్ బాలుడిని శనివారం పొదిలి పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే గత రెండు నెలల కాలంలో పొదిలి పట్టణంలో స్టీల్ షాపు, రక్త పరీక్ష కేంద్రం, రేషన్ షాపు మరియు బ్యాంకు కాలనీలో జరిగిన నాలుగు దొంగతనాలతో సంబంధం ఉన్నఒంగోలు సమత నగర్ కు చెందిన మైనర్ బాలుడు యాదాల వెంకటేశ్వర్లు (17) శనివారం అరెస్టు చేశారు. జరిగిన దొంగతనాలపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు శనివారం ఉదయం యస్ యస్ ఆర్ అపార్ట్మెంట్ వద్ద అనుమానాస్పద స్ధితిలో తిరుతున్న బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నాలుగు దొంగతనాలను తనే చేసినట్లు ఒప్పుకున్నట్లు తన వద్ద ఉన్న 90వేల నగదు, నాలుగు సెల్ ఫోన్లు, స్వాధీనం చేసుకుని మైనర్ కావడంతో ప్రత్యేక బాలల న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నట్లు పొదిలి ఇన్చార్జ్ యస్ఐ శ్రీహరి ఒక ప్రకటనలో తెలిపారు.