ఏఎంసి చైర్మన్ కాకర్ల శ్రీనివాస్ యాదవ్ ప్రమాణస్వీకారం కార్యక్రమానికి హాజరైన యాదవ మహాసభ నాయకులు
మార్కాపురం ఏఎంసి చైర్మన్ గా కాకర్ల శ్రీనివాస్ యాదవ్ శనివారంనాడు మార్కాపురం మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ప్రమాణస్వీకారం కార్యక్రమానికి అఖిలభారత యాదవ మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు పొల్లా నరసింహ యాదవ్, జిల్లా కార్యదర్శి మూరబోయిన బాబురావు యాదవ్ ఆధ్వర్యంలో పొదిలి యాదవ మహాసభ నాయకులు గజమాల వేసి దుశ్శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు పొల్లా నరసింహ యాదవ్, జిల్లా కార్యదర్శి మూరబోయిన బాబురావు యాదవ్, మండల అధ్యక్షులు సిరిమల్లె శ్రీనివాస్ యాదవ్, కనకం వెంకట్రావు యాదవ్, పెమ్మని రాజు యాదవ్, బలగాని నాగరాజు యాదవ్, సుబ్బారావు యాదవ్, కొండెబోయిన నరసింహ యాదవ్, బండారు శివ యాదవ్, మువ్వా సాయికృష్ణ యాదవ్, పవన్ యాదవ్, వెంకటేష్ యాదవ్, శివ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.