ములాయంసింగ్ యాదవ్ 79 పుట్టినరోజు వేడుకలను జయప్రదం చేయండి

సమాజ్ వాది పార్టీ వ్యవస్థాపకులు మాజీ రక్షణ శాఖ మంత్రి…. మాజీ ముఖ్యమంత్రి….. బావి ప్రధాని ములాయం సింగ్ యాదవ్ 79వ పుట్టినరోజు వేడుకలను జయప్రదం చేయాలని అఖిల భారత యాదవ మహాసభ జిల్లా నాయకులు పొల్లా నరసింహ యాదవ్, మూరబోయిన బాబూరావు యాదవ్, బత్తుల వెంకటేష్ యాదవ్, కనకం వెంకట్రావ్ యాదవ్ లు ఒక ప్రకటనలో కోరారు. బుధవారం ఉదయం స్ధానిక యాదవ మహాసభ కార్యాలయంలో ఈ వేడుకలు జరుగుతాయని ముఖ్య అతిధిగా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ నూకసాని బాలాజీ యాదవ్ హాజరు కానున్నారని కావున ఈ కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.