తడి, పొడి చెత్త సేకరణ కోసం ప్లాస్టిక్ డబ్బాలు పంపిణీ

స్వచ్చ్ సర్వేక్షణ్ లో భాగంగా తడి చెత్త, పొడిచెత్త సేకరణ కోసం ప్లాస్టిక్ డబ్బాలను పంపిణీ చేశారు. వివరాల్లోకి వెళితే గ్రామ పంచాయతీ పరిధిలోని స్థానిక 1వ వార్డు నేతపాలెం నందు సోమవారం నాడు మండల పరిషత్ అధ్యక్షులు నరసింహరావు డబ్బాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి రంగనాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ సర్వేక్షణ్ లో భాగంగా నివాస, నివేశతెరల నుండి తడి చెత్త, పొడి చెత్తను వేరు వేరుగా తీసుకుని వాటిని డంపింగ్ యార్డుకు చేర్చి తిరిగి పునరుత్పత్తి చేస్తామని అందులో భాగంగా, ప్రతి ఇంటికి తడి చెత్త కోసం ఒక డబ్బాను, పొడి చెత్త కోసం ఒక డబ్బాను ఇస్తామని ప్రతి వెయ్యి మందికి ఒక వ్యక్తి చొప్పున నియమాకం చేసి వారిలో పవర్ రిక్షా వాలాలను ముగ్గురిని ఎంపిక చేసి నెలకు ఆరువేల రూపాయల వేతనం ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి మరియు పంచాయతీ ప్రత్యేక అధికారిణి రత్నజ్యోతి, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.