ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో మానవ హక్కుల దినోత్సవ వేడుకలు

విశ్వనాథపురం స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో మానవ హక్కుల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. వివరాల్లోకి వెళితే జూనియర్ సివిల్ జడ్జి మరియు మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎస్ సి రాఘవేంద్ర ఆదేశాల మేరకు బార్ అసోసియేషన్ న్యాయవాదులు మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్ధులకు మానవ హక్కులు వాటి ఉపయోగాలు వివరించారు. ఈ సందర్భంగా న్యాయవాది శ్రీపతి శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే అన్యాయాన్ని ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలని అన్నారు. భరత రాజ్యాంగంలో మానవులకు కొన్ని హక్కులను కల్పించడం జరిగిందని వాటి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అన్నారు. హక్కులతో పాటు భారత పౌర విధులు, బాధ్యతలు వంటి వాటి గురించి తెలుసుకుని మంచి పౌరులుగా ఎదగాలని అన్నారు. అలాగే చదువులోనూ, ఆట పాటలలోనూ రాణించి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ న్యాయవాదులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.