మార్పులో బాగస్వామ్యంకండి జగన్మోహన్ రెడ్డి కి అవకాశం ఇవ్వండి: జంకె

మార్పులో బాగస్వామ్యం అయ్యి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని మార్కపురం నియైజకవర్గం శాసనసభ్యలు జంకె వెంకటరెడ్డి అన్నారు. వివరాలు లోకి వెళితే స్ధానిక విశ్రాంత ఉద్యోగల కార్యలయంలో జరిగిన సమావేశంలో ముఖ్య అతిధిగా హాజరైన జంకె వెంకటరెడ్డి మాట్లాడుతూ విశ్రంత ఉద్యోగలు మేథ సంపతి కలిగిన మేధావులని ప్రస్తుతం ప్రజాస్వామ్యం అపహస్యం అవుతుందిని ప్రజాస్వామ్యం పరిరక్షణలో భాగంగా మేధావులైన విశ్రాంత ఉద్యోగులు ఒక అవకాశం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యో విధంగా పాటుబాడలని అదేవిధంగా మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రస్తుతం అమలలో ఉన్నా కాంట్రిబుషన్ పెన్షన్ విధానంన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానంన్ని అమలు చేస్తామని ఈ అంశంన్ని పార్టీ మేనిఫేస్ట్ లో పెడతాంని ఆయన అన్నారు. జడ్పీటిసి సభ్యులు సాయి రాజేశ్వరరావు మాట్లాడుతూ మండల పరిషత్ కార్యలయం ప్రాంగణంలో ఉపాధ్యాయ సంఘలకు కార్యలయల సాముదాయంకు స్ధలం కేటాయించే విషయం పరిశీలనలో ఉందాని త్వరలో సమావేశంలో తీర్మానం చేసి స్ధలం మంజూరు చేస్తామని అన్నారు. ఈ సమావేశంకు బాదుల్లా అద్యక్షతనతో వహించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సోమేశ్వరరావు మండల పరిషత్ అధ్యక్షులు కోవెలకుంట నరసింహరావు ఎంపిడిఓ నాగేశ్వరరావు యస్టీఓ ప్రసాద్ యుటియఫ్ రాష్ట్ర నాయకులు రమణరెడ్డి విశ్రాంత ఉద్యోగులు వీరారెడ్డి కృష్ణ రెడ్డి దానమ్మ తదితరులు పాల్గొన్నారు