ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు

సెమి క్రిస్మస్ వేడుకలు ఘనంగా స్ధానిక మండల పరిషత్ కార్యలయంలో నిర్వహించారు. వివరాలు లోకి వెళితే స్ధానిక మండల పరిషత్ కార్యలయంలో బుధవారం జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరైన శాసనసభ్యలు జంకె వెంకటరెడ్డి ప్రత్యేక ఏర్పాటు చేసిన క్రిస్మస్ కేక్ను కోసి పంచిపెట్టారు . ఈ సందర్భంగా శాసనసభ్యలు జంకె వెంకటరెడ్డి మాట్లాడుతూ ముందుగా క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మతాలన్ని ఒక్కటేనని, ఏ గ్రంథమైనా కలసి మెలసి సోదరా భావంతో మెలగాలనే సూచిస్తున్నయన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటిసి సభ్యులు సాయిరాజేశ్వరావు ఎంపిపి నరసింహరావు ఎంపిడిఓ రత్నజ్యోతి ఈఓఆర్డీ రంగా నాయకులు ఎపిఓ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు