75 లక్షలతో నూతన ఖజానా కార్యాలయం నిర్మాణం : చంద్రశేఖర్ రెడ్డి
75లక్షల రూపాయలతో పొదిలి ఉప ఖజాన నూతన కార్యాలయం నిర్మాణం చేపడుతున్నట్లు ఖజనా శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎం చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. వివరాల్లోకి వెళితే గురువారం స్ధానిక ఉప ఖజన కార్యాలయాన్ని సాధారణ తనిఖీలో భాగంగా డిప్యూటీ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరుల ఆయన మాట్లాడుతూ 75లక్షల రూపాయలు నిధులతో తలపెట్టనున్న నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేశారని రెవెన్యూ శాఖ స్ధలం మంజూరు ప్రక్రియ పూర్తి కాగానే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో యస్టీఓ ప్రసాద్, సిసి పిల్లి లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు.