ఘనంగా జగన్ జన్మదిన వేడుకలు
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి 46వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివరాల్లోకి వెళితే శుక్రవారం స్థానిక ప్రభుత్వ వైద్యశాల వద్ద కేక్ కటింగ్, తదుపరి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటిసి సభ్యులు సాయిరాజేశ్వరరావు, ఎంపిపి నరసింహరావు, మండల కన్వీనర్ గుజ్జుల సంజీవరెడ్డి, ప్రభుత్వం వైద్యులు చక్రవర్తి, మండల కో ఆప్షన్ సభ్యులు షేక్ మస్తాన్ వలి, వైసీపీ జిల్లా కార్యదర్శి కొత్తపులి బ్రహ్మారెడ్డి, వైసీపీ మండల నాయకులు షేక్ రబ్బాని, షేక్ నాయబ్ రసూల్, షేక్ ఛోటా ఖాసిం, మండల యూత్ నాయకులు పొదిలి ఏడుకొండలు ,షేక్ గౌస్ బాషా, ముల్లా బాషా తదితరులు పాల్గొన్నారు.