నుర్జహన్ ఆద్వర్యంలో జగన్ జన్మదిన వేడుకలు
పంచాయితీ తాజా మాజీ పాలకవర్గ సభ్యారాలు వైసీపీ మహిళ నాయకరాలు షేక్ నుర్జహన్ ఆద్వర్యం వైసీపీ అదినేత జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. వివరాలులోకి వెళితే శుక్రవారం స్థానిక విశ్వనాథపురం వైయస్ఆర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన జన్మదిన కేక్‌ను నుర్జహాన్ కోసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే విధంగా ప్రతి కార్యకర్త కృషి చెయ్యలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు షేక్ రబ్బాని షేక్ జవేద్ లడ్డూ ముల్లా భాష షేక్ షరీఫ్ షేక్ గౌస్ భాష షేక్ బాజీ తదితరులు పాల్గొన్నారు