ఘానంగా బాలల దినోత్సవం & చాచా నెహ్రు జయంతి వేడుకలు
జాతీయ బాలల దినోత్సవం & పండిట్ జవహర్ లాల్ నెహ్రు జయంతి వేడుకలు పొదిలి పట్టణంలోని ప్రభుత్వ ప్రేయివేటు విద్యా సంస్థ లలో ఘానంగా నిర్వహించారు. నెహ్రూ జననం.14-11-1889. మరణం. 27-5-1864. తండ్రి. మోతీలాల్ నెహ్రు. తల్లి. స్వరూపరాణి. భార్య. కమలానెహ్రు. వివాహం.2-8-1916. కుమార్తె. శ్రీమతి ఇందిరా ప్రియదర్శిని (భారత మాజీ ప్రధాని.) సోదరి విజయ లక్ష్మీ పండిట్.(వీరు స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్నవారే) స్వస్దలం. ఉత్తర ప్రదేశ్ లోని అలహాబాద్. విద్య.ఇంగ్లాండ్ లోని ఆక్సఫర్డ్ విశ్వ విద్యాలయమందు న్యాయవాద పట్టాపొంది భారత్ లో ప్రఖ్యాత న్యాయవాదిగా ప్రసిధ్ది చెందెను. భారత జాతీయోద్యమంలో ప్రవేసించి మహత్మ గాంధీ గారికి సన్హితులై జాతీయోద్యమంలో గాంధీజి తరువాత రెండవ నాయకుడిగా ప్రసిధ్ధి చెందెను. 1947 నుండి 1964 వరకు అనగా స్వాతంత్యము వచ్చినది మొదలుకొని మరణించేతవరకు 17 సం”లు భారత ప్రధానిగా, జాతీయ కాంగ్రేస్ దేశాద్యక్షులుగా ఎంతో సమర్దవంతముగా పనిచేసెను. నెహ్రుజి భారత పేరొందిన న్యాయవాది, ప్రముఖ రాజకీయవేత్త, స్వతంత్య్ర సమర పోరాట యోధుడు, మానవతావాది, శాంతి దూత, నవభారతనిర్మాత, ప్రముఖ రచయిత, చరిత్రకారుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, భారత మెదటి ప్రధాని. స్వాతంత్య్ర పోరాటములోను, దేశాభివృధ్ధికి ఆయన పడినశ్రమ శాస్త్ర సాంకేతిక రంగాలలో భారత్ ను అగ్రస్దానానికి చేర్చిన ఆయన కృషి, దేశంకోసం తన యావదాస్దిని హరతి కర్పూరంలా అర్పించిన ఆయన నిస్వార్దత యివన్ని ఆయనను భారతీయుల గుండెలలో చిరస్తాయిగా వుండేల చేశాయి.భరతదేశ అభివృధ్ధి కోసం ప్రణాలికా సంఘం ఏర్పరిచి పంచవర్ష ప్రణాళికలకు రూపకల్పన చేసి ప్రణాళికా పితామహుడుగా పేరుగాంచాడు. ప్రభుత్వ రంగాన్నిపెంచుతూ ఉత్వత్తి రంగాలను ప్రభుత్వ పరంచేస్తు ప్రజాస్వామ్య వ్యవస్తకు దోహvదం చేస్తు దేశ ఆర్దిక, పారిశ్రామిక రంగాలలో ప్రగతిని సాదించడమే పంచవర్హ ప్రణాళి కల వుద్దేశము. ప్రస్తుతం 12 వ ప్రణాళిక అమలులో వుంది. తే. 10-12-1955 ది. లో నెహ్రూ గారు నాగార్జున సాగర్ ప్రాజక్టుకు పునాది రాయి వేశారు. వీరికి భారత రత్న బిరుదునిచ్చి ప్రభుత్వం సత్కరించిందని వక్తలు ప్రసాగించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ రకాల పోటీల లలో గెలుపొందిన విద్యార్థులు లకు భహుమతులు ప్రధానం చేసారు.