భవిత పాఠశాలకు టెలివిజన్ బహుకరించిన రక్షిత నీటి సరఫరా సిబ్బంది
భవిత పాఠశాలకు రక్షిత నీటి సరఫరా సిబ్బంది టెలివిజన్ ను బహుకరించారు. శుక్రవారంనాడు ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో రక్షిత నీటి సరఫరా ఈఈ మల్లికార్జునరావు భవిత పాఠశాల సిబ్బందికి టివి ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులలో విశేష ప్రతిభ ఉంటుందని వారిలోని ప్రతిభను వెలికితీసి మెరుగైన పౌరులు తీర్చిదిద్దే విధంగా భవిత కేంద్రాలు పని చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో-ఆర్డినేటర్ గీతా మాధురి, భవిత పాఠశాల సిబ్బంది గోపాల కృష్ణ, రక్షిత నీటి సరఫరా సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.