కరువు పరిస్థితుల్లో రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
కరువు పరిస్థితులలో రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని సిపిఐ, సిపియం, జనసేన ఆధ్వర్యంలో శుక్రవారం పొదిలి విశ్వనాథపురం సెంటర్ నందు రాస్తారోకో నిర్వహించారు. భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కు అంతరాయం కలగడంతో రక్షక భటులు రాస్తారోకోను అడ్డుకుని ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. ఈసందర్భంగా సిపిఎం పశ్చిమప్రకాశం జిల్లాప్రధాన కార్యదర్శి యం.రమేష్ మాట్లాడుతూ ప్రకాశంజిల్లా వర్షపాతం లేక రైతులు కరువుతో అల్లాడుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తోందని అన్నారు. పొదిలి పెద్దచెరువును సాగర్ నీటితో నింపాలని, నాగార్జునసాగర్ కుడికాలువ రెండోదశ పనులను ప్రారంభించాలని, రైతులకు పంట నష్టపరిహారం త్వరగా అందేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రాస్తారోకోలో సిపిఐ ఏసురత్నం, జనసేన నాగేశ్వరరావు, రైతులు, రాస్తారోకో ద్వారా నిరసన తెలిపారు