తెదేపా మరియు వైకాపా జనసేన ఆధ్వర్యంలో నూతన సంవత్సర ఆహ్వాన వేడుకలు

2019 నూతన సంవత్సర ఆహ్వాన వేడుకలు కార్యక్రమాన్ని ప్రధాన రాజకీయ పార్టీలైన తెలుగు దేశం పార్టీ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోటాపోటీగా నిర్వహించేందుకు ఏర్పాట్లకు సిద్ధం చేసుకుంటున్నారు. ఎన్నికలు సమీపంలో ఉండడంతో కార్యకర్తలను ఉత్సాహపరిచే విధంగా ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన నేతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పొదిలి ప్రధాన వీధులలో కేకు కటింగ్ మరియు నూతన సంవత్సర ఆహ్వాన వేడుకలు ఘనంగా నిర్వహించే కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా అన్ని ప్రధాన పార్టీలు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజలకు ఆహ్వానం పలుకుతున్నట్లు సమాచారం.