సాగర్ జలాల సాధనకై ఉద్యమబాట

సాగర్ కుడి కాలువ నుండి పొదిలి పెద్ద చెరువుకు సాగర్ జలాలు నింపేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు ఒత్తిడి పెంచదానికి రేపటి నుండి పొదిలి మండల నీటి సమస్య గురించి 1100 నెంబర్ కు మీ మొబైల్ నెంబర్ నుండి ఫోన్ చేసి చెరువుకి నీళ్లు కావాలని కోరుతూ పట్టణ ప్రజలు ఉద్యమంగా ముందుకు తమ అభిప్రాయాలను వ్యక్తపరచే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సాగర్ జలాల సాధన సమితి నాయకులు ఆదివారం జరిగిన సమావేశంలో తీర్మానం చేశారు. ఈ కార్యక్రమాన్ని వారం పాటు నిర్వహించి 1100కు వేల ఫోన్ కాల్స్ వెళ్లే విధంగా ప్రజలను సన్నద్దం చేయాలని తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.