పాల క్యాన్లు పంపిణీ చేసిన నారా భువనేశ్వరి
ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి మహిళా పాడి రైతులకు స్టీల్ పాల క్యాన్లను పంపిణీ చేశారు. వివరాల్లోకి వెళితే మండలంలోని కంచేపల్లి హెరిటేజ్ పాలకేంద్రం నందు సోమవారం హెరిటేజ్ రైతు సంక్షేమ నిధి సౌజన్యంతో పాల ఉత్పత్తిదారు మహిళలకు నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా స్టీల్ పాల క్యాన్లను పంపిణీ చేసి మహిళలతో రైతుల యొక్క బాగోగులు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో హెరిటేజ్ సంస్థ జిల్లా మేనేజర్ రామసుబ్బయ్య, సాంబశివరావు, స్థానిక తెలుగు దేశం పార్టీ నాయకులు బాదం రవి తదితరులు పాల్గొన్నారు