సమ్మె నోటీసు ఇచ్చిన ఉపాధి హామీ ఉద్యోగులు

ఉపాధి హామీ మరియు నీటి యాజమాన్య సంస్థలలో పనిచేసే ఒప్పంద ఉద్యోగులు జనవరి రెండవ తేది నుండి తమ డిమాండ్ల సాధనకై తలపెట్టిన నిరవధిక సమ్మె దృష్ట్యా స్ధానిక మండల పరిషత్ కార్యలయం నందు సోమవారం మండల అధ్యక్షులు కోవెలకుంట్ల నరసింహరావుకు ఉపాధి హామీ కార్మికులు సమ్మె నోటీసు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎపిఓ కళ్యాణి, రెడ్డిబోయిన సుబ్బారావు, ఈ సుధాకర్, హైమవతి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.