బట్టువారిపల్లిలో జనసేన క్యేలండర్ ఆవిష్కరణ
జనసేన నాయకులు బట్టువారిపల్లి గ్రామంలో పర్యటించారు. పార్టీ విశిష్ట పర్యటనలో భాగంగా మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన జనసేన నాయకులు బట్టువారిపల్లి గ్రామం నందు నూతన సంవత్సర కేకును కట్ చేసి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులకు పంచిపెట్టారు. అనంతరం నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల నాయకులు షేక్ కాలేషా, యస్పీ ఖాజా, షేక్ ఇంతియాజ్, షేక్ షఫీ, పండు, శ్రీను, షేక్ రఫీ, షేక్ మొహిద్దిన్జ్ శ్యాంబాబు, దాసు, గిడ్డన్, నరేష్, ఇమ్మానియేల్, వెంకీ, విజయ్, ప్రసాద్, చరణ్, అభి తదితరులు పాల్గొన్నారు.