జన్మభూమి మా ఊరు కార్యక్రమం ప్రారంభం
మండలంలోని ఏలూరు, ఉప్పలపాడు గ్రామాల్లో జన్మభూమి మా ఊరు కార్యక్రమం ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో మొదటిరోజు కార్యక్రమాన్ని మండలంలోని ఏలూరు, ఉప్పలపాడు గ్రామాల్లో ప్రారంభించి నాలుగు సంవత్సరాల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసిన సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి కొత్తగా మంజూరైన రేషన్ కార్డులను మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల నారాయణరెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ దివి శివరాం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల రెవిన్యూ తహశీల్దార్ విద్యాసాగరుడు, ఎంపిడివో రత్నజ్యోతి, హౌసింగ్ డిఈ లక్ష్మీ నారాయణ, అధికారులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.