డీప్ బోరు పనులను ప్రారంభించిన జడ్పీటీసీ సాయి రాజేశ్వరరావు
స్థానిక విశ్వనాధపురం 12వ వార్డులో డీప్ బోరు పనులను జడ్పీటీసీ సాయి రాజేశ్వరరావు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం ఎంపీపీ నరసింహారావు, 12వ వార్డు మాజీ సభ్యులు నూర్జహాన్ కొబ్బరికాయ కొట్టిన అనంతరం బోరు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా నూర్జహాన్ మాట్లాడుతూ ప్రజలు తీవ్రంగా నీటి సమస్య ఎదుర్కొంటున్న సమయంలో జడ్పీటీసీ సాయి రాజేశ్వరరావు చొరవ తీసుకుని జడ్పీ నిధులతో డీప్ బోర్లు వేసేందుకు నిధులను మంజూరు చేయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో 10వ వార్డు మాజీ సభ్యులు ఖాసీం, మస్తాన్ వలి, కోగర వెంకట్రావు, మునీర్, వార్డు ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.