పనులు ప్రారంభించండి….. లేదా పూడ్చేయండి
స్థానిక 11వ వార్డు ఇస్లాంపేటలో ఇటీవల అంగన్వాడీ భవనానికి చేసిన శంకుస్థాపనతో చాలా ఇబ్బందులు పడుతున్నామని 11వ వార్డు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఉర్దూ పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఇటీవల 11వ వార్డు ఉర్దూ పాఠశాల పక్కనే నూతన అంగన్వాడీ భవన నిర్మాణం కోసం శంకుస్థాపన చేసి గుంటలను తీశారు అనంతరం పనులను ఆపేయడంతో ఇస్లాంపేట 11వ వార్డులోని మురుగునీరు మొత్తం భవన నిర్మాణం కోసం తీసిన గుంటలలో నిలిచిపోతుందని ఈ మురుగు నీటివల్ల అనేక రకాల వ్యాధులు వ్యాప్తిచెందే అవకాశం ఉందని అలాగే పిల్లలు ఆడుకుంటున్న సమయంలో పడిపోతే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. సంబంధిత అధికారులకు ఈ విషయమై ఫిర్యాదు చేశామని ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. మేము పనులకు వెళ్లి వచ్చేంత వరకు పిల్లలు ఇక్కడే అడుకుంటుంటారు అలాంటి సమయంలో వారు పొరపాటున పడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి తక్షణమే పనులు ప్రారంభించాలని లేకపోతే ఆ గుంటలను పూడ్చేయాలని వార్డు ప్రజలు కోరుతున్నారు.