బలవంతపు వివాహం చేసుకున్న యువకుడి అరెస్ట్….. నిర్భయ కేసు నమోదు
బాలికను మాయమాటలతో కిడ్నాప్ చేసి, బలవంతంగా వివాహం చేసుకున్న యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే పొదిలిలోని 9వ తరగతి చదువుతున్న బాలిక(14) కిడ్నాప్ కు గురైందని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి పొదిలిలో ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తున్న దర్శి మండలం బొట్లపాలెం గ్రామానికి చెందిన పెరికె శ్రీనివాస్(21) బాలికను మాయమాటలతో నమ్మించి కిడ్నాప్ చేసి బలవంతంగా వివాహం చేసుకున్న కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి కిడ్నాప్, నిర్భయ, బలవంతపు వివాహం కింద కేసులు నమోదు చేసి గురువారం నాడు పొదిలి జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరు పరచగా కోర్టు ముద్దాయికి రిమాండ్ విధించినట్లు దర్శి ఇంచార్జి డిఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో పొదిలి ఎస్ఐ శ్రీరామ్, శిక్షణ ఎస్ఐ భవాని, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.