పొదిలిలో జన్మభూమి మాఊరు కార్యక్రమం
పొదిలి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల జన్మభూమి మా ఊరు కార్యక్రమం నిర్వహించారు. వివరాల్లోకి వెళితే స్థానిక పెద్దబస్టాండ్ లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జన్మభూమి మా ఊరు 3వ రోజు కార్యక్రమం మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి రత్నజ్యోతి అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమంలో గత నాలుగు సంవత్సరాల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన రాష్ట్ర అభివృద్ధిని గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ రత్నజ్యోతి మాట్లాడుతూ జన్మభూమి కార్యక్రమం ప్రజా సమస్యల పరిష్కారమే ఈ జన్మభూమి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అని ప్రతి సంక్షేమ పథకం లబ్ధిదారులకు అందాలనే ప్రభుత్వం జన్మభూమి కార్యక్రమంలో అర్జీలు స్వీకరించి పరిష్కారం చేయడం జరుగుతుందని అన్నారు. మండలంలో జరిగిన మరియు జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి మరియు పొదిలి మేజర్ పంచాయతీ పారిశుధ్యం నిర్వహణ, చెత్త సేకరణ పంచాయతీ అభివృద్ధి కార్యక్రమాలను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఇళ్ల స్థలాలు కావాలని వికలాంగులు కోరగా రెవిన్యూ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ ఈ విషయం తహశీల్దార్ దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. కొందరు మహిళలు నీటి సమస్య గురించి అడగగా డీప్ బోర్లు వేయించి పరిష్కరిస్తామని ఎంపిడిఓ అన్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపధ్యంలో జన్మభూమి కార్యక్రమానికి అర్జీలు వెల్లువెత్తాయి. ఇళ్ల స్థలాలకు, ఇంటి నిర్మాణానికి, రేషన్ కార్డులకు అధిక సంఖ్యలో ప్రజలు అర్జీలు పెట్టుకున్నారు.